Sunday, January 10, 2010
నీ కనులా కనులు కలిపి
Sunday, August 9, 2009
నా రాణివి నీవా..
సిరిమువ్వకు సవ్వడి నిచ్చిన సరిగమవు నీవా....
మరు మల్లెకు పరిమళమిచ్చిన సుమగంధము నీవా...
అలకోనకు వెలుగులనిచ్చిన రేరాణివి నీవా...
నటరాజును అందియనుంచిన మయూరము నీవా...
సెలయేటికి హొయలిచ్చిన నడుమొంపులు నీవా...
విరి తేనియకు మధురిమ నిచ్చిన అధరాలు నీవా...
నా మది కొలువుండే నా రాణివి నీవా..
Thursday, February 5, 2009
సమీరమా
చిగురాకుల రెపరెప తో మురిపించె సమీరమా
అల కోయిల కిల కిలతో తిరిగొచ్చిన వసంతమా
సెలయేటి గల గలలా పొంగి పొరలు నయగారమా
చిలిపికోరిక పుట్టించే కొంటె కనుల వయారమా
చెరిగిపోని నేస్తానికి నీ చెలిమొక భాష్యమా
Wednesday, October 29, 2008
పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి
పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి,
రేరాణి పరిమళాలు పిల్ల గాలులపై తేలి వస్తుంటే,
అర విరిసిన మరు మల్లెలు ఎద లోతుల తన గ్యాపకాలు .....
ఆ నవ్వు - నడుమొంపున వయ్యారం -- తన వెచ్చని ఊపిరిని గుర్తు చేస్తుంటె....
తన తోడు కొరకు ఈ తుంటరి మనసు చెసే అల్లరి....
ఎందుకంటె ఏమని చెప్పను,... అందుకే అని ఎలా చెప్పను !!!
ఫ్రతి క్షణం నా శ్వాసలో కదలడె తన ఊపిరి వెచ్చని కొరిక ఎదొ ఎదలో రెపింది,
హాయిగొలిపె ఏకాంతంలో, అపురూపమగు నా చెలిరూపం నన్నిలవనీయకుంది,
నులి వెచ్చని తన కౌగిలి చేరి కరగి పొమ్మన్నది,
పండు వెన్నెల కురిసె నిందు పున్నమి రాతిరి,
తన ఎద పై వాలి సేదతీరమన్నది.....
Monday, October 13, 2008
ప్రాణానికి ప్రాణమా
ప్రాణానికి ప్రాణమా నా ఆరో ప్రాణమా
హ్రుదయం లోని రూపమా నా ప్రేమకు ప్రతిరూపమా
నిదురలోని స్వప్నమా నా కవితకు జీవమా
కనులలోని భావమా నా ప్రేమకు తొలి భాష్యమా
కనులు మూసిన చెలి నీ రూపం
కనులు తెరిచినా నీ దరహాసం
ఎందుకు నాతో ఈ పరిహాసం
నిన్నే చూడాలని నీతో ఉండాలని
ఎదో చెయాలని ఎంతో చెప్పాలని
ఆగదు నామనసొక క్షణమైన
నిలవదు నా మది నిముసమైన
నీ ఙాపకలే నా ఊపిరై
నీ తలపులె నా జీవమై
జీవిస్తున్నా నీలోని స్వాసనై
Saturday, October 4, 2008
అంజలి
తళుకు లొలుకు కనులకు నయనాంజలి
సుధలూరె పెదవులకు అధరాంజలి
మరులూరె నగుమొముకు మొహనాంజలి
వలపులొలుకు రూపనికి మొహనాంజలి
అందుకో నీకై విరిసిన నా కవితా కుసుమాంజలి
Wednesday, September 17, 2008
అభిసారిక
నా గుండెలో మోగిన భావరాగ తొలి గీతిక
నా కనులలో మెదిలిన అరుణోదయ షుభ దీపిక
నీవేనా
నా హ్రుదయ వీణ మీటిన గోపిక
ఓహొ నా అభిసారిక
అందుకో నా హ్రుదయమనె విరి కానుక